Before blindly trusting others.. check whether these qualities are present in them.. or not..
Psychology: ఎదుటి వారిని గుడ్డిగా నమ్మే ముందు.. ఈ లక్షణాలు వారిలో ఉన్నాయో.. లేవో.. పరీక్షించాలి!
ఏ బంధమైన నమ్మకం అనే పునాది మీదనే నిలబడుతుంది. నమ్మకం సన్నగిల్లితే వెయ్యేళ్ల బంధమైనా క్షణాల్లో తెగిపోతుంది. ప్రేమ, స్నేహం.. ఏ విషయంలోనైనా నమ్మకం చాలా ముఖ్యం. అందుకే నమ్మకం బంధానికి పునాది అని అంటారు. నేటి కాలంలో నమ్మకం సంపాదించుకోవడం చాలా కష్టం. అదే.. ఒకసారి నమ్మకం ఏర్పడితే, ఆ నమ్మకం ఆ సంబంధాన్ని కలకాలం నిలబెట్టుకుంటుంది. కానీ ఒక వ్యక్తి మోసం చేస్తున్నాడని మనకు తెలిసిన తర్వాత, వారు ఏం చేసినా అది మనకు మోసంగానే అనిపిస్తుంది. ఈ అనుభవం ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురై ఉంటుంది. అటువంటి వ్యక్తిపై మళ్లీ నమ్మకం ఏర్పడదు. అయితే ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మే ముందు, వారిలో ఈ కింది లక్షణాలు ఉన్నాయో లేవో గమనించాలని అంటున్నాడు చాణక్యుడు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ప్రశాంతంగా, గంభీరంగా ఉండే గుణం
ప్రతి ఒక్కరి జీవితంలో మంచి లక్షణాలు, చెడు లక్షణాలు ఉంటాయి. అయితే సోమరితనం, గొప్పలు చెప్పుకునే వారిని, పదే పదే అబద్ధం చెప్పే అలవాటు ఉన్న వారిని మాత్రం ఎట్టిపరిస్థితిలోనూ ఎప్పుడూ నమ్మవద్దు. ప్రశాంతంగా, గంభీరంగా, నిజాయితీగా మాట్లాడేవారిని.. ధర్మమార్గంలో నడిచేవారిని మాత్రమే విశ్వసించాలని చాణక్యుడు చెబుతున్నాడు.
త్యాగం చేసే లక్షణం
ఒక వ్యక్తిని నమ్మే ముందు వారిలో త్యాగం (sacrifice) చేసే గుణం ఉందో లేదో చూడాలి. ఇతరుల జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావడానికి ఇలాంటి వారు తమ సొంత ఆనందాన్ని కూడా త్యాగం చేస్తారు. ఈ వ్యక్తులు ఇతరుల బాధలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈ వ్యక్తులను గుడ్డిగా ఎన్నాళ్లైనా నమ్మవచ్చు.
వారి కుటుంబంలో వారి పాత్ర ఎలాంటిది?
మీరు ఎవరినైనా నమ్మే ముందు, కుటుంబంలో వారి పాత్ర ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. ఆ వ్యక్తి తన ఇంట్లో వారిని ఎలా చూసుకుంటాడు? అతని ఇంట్లో వారి పాత్ర ఏమిటి? వారు ఎలాంటి పని చేస్తారు? వారు మంచి పనులు చేస్తారా లేదా చెడు పనులు చేస్తారా? అనే విషయాలు తప్పక తెలుసుకోవాలి. అప్పుడే వారు నమ్మదగినవారో కాదో నిర్ణయించవచ్చు.
కొంత డబ్బు అప్పు ఇచ్చి చూడండి
కొంతమందికి, సంబంధాల కంటే డబ్బు విలువైనది. ఎవరైనా నమ్మకమైనవారో.. కాదో.. తెలుసుకోవడానికి వారికి డబ్బు ఇవ్వడం ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. మీరు ఎవరినైతే నమ్మాలని అనుకుంటున్నారో.. వారికి ముందుగా కొంత డబ్బు అప్పుగా ఇచ్చి చూడండి. వారు ఆ డబ్బును సమయానికి తిరిగి ఇస్తే, మీరు వారిని పూర్తిగా నమ్మవచ్చు. అయితే కొంతమంది స్వార్థపూరిత ఆలోచనలతో, తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించాలని ఆలోచిస్తుంటారు. వారు ఎప్పటికీ నమ్మదగినవారు కాలేరు. ఇలాంటి వారి నుంచి మీరు ఇచ్చిన డబ్బు ఎన్నటికీ తిరిగిరాదు.