Everyone has YouTube channel in that Village.
ఆ ఊర్లో ఇంటికో యూట్యూబ్ ఛానల్.. విదేశాల్లో ఉద్యోగాలు వదిలి సొంతూళ్లకు..
సాధారణంగా పల్లె ప్రాంతాల్లో నెట్ వర్క్ తక్కువగా ఉంటుంది. ఇంటర్నెట్ వినియోగం కూడా తక్కువే. దీంతో సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్రపంచానికి గ్రామీణ ప్రాంతాల ప్రజలు దూరంగా ఉంటారు. వ్యవసాయం, పశుపోషణ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ గ్రామం మాత్రం డిజిటల్ యుగంతో పోటీగా దూసుకెళ్తోంది. ఈ గ్రామం సక్సెస్ పైనే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ గ్రామస్థులు ఇప్పుడు ఆర్థికంగా కూడా విజయం సాధించారు. మరి ఆ గ్రామం గురించి మీరూ తెలుసుకోండి..
ప్రస్తుతం డిజిటలైజేషన్, సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఈ అవకాశాన్ని పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రం రహీమ్ యార్ ఖాన్ జిల్లాకు చెందిన ఓ చిన్న గ్రామం అందిపుచ్చుకుంది. ప్రస్తుతం ఈ గ్రామం యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ కు కేర్ ఆఫ్ గా మారింది. ఓ ప్రముఖ వార్తా సంస్థ చేసిన సర్వే ప్రకారం.. అక్కడ మొత్తం 80 కుటుంబాలు ఉన్నాయి. దాదాపు ప్రతి కుటుంబంలో ఓ యూట్యూబర్ ఉన్నాడు. కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు.
విదేశాల నుంచి వచ్చి...
దీంతో ఈ గ్రామం పాకిస్థాన్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ గ్రామంలో మొత్తం 200 వరకు యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నట్లు ఈ గ్రామానికి చెందిన హైదర్ అలీ తెలిపాడు. తాను యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి సంవత్సరం అయిందన్నాడు. ఊరిలో చాలా మందికి గోల్డ్, సిల్వర్ ప్లే బటన్స్ వచ్చాయని అన్నాడు. ఇంతకుముందు ఏళ్లతరబడి ఆస్పత్రిలో సంపాదించిన డబ్బును ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్ లో ఒక్క రోజులోనే సంపాదిస్తున్నానని అన్నాడు.
ఇదే స్ఫూర్తితో విదేశాల్లో పనిచేస్తున్న చాలా మంది యువత అక్కడ ఉద్యోగాలు వదిలి ఇక్కడికి వచ్చి ఛానెల్స్ ఆపరేట్ చేస్తున్నారని తెలిపాడు. కొత్తగా యూట్యూబ్ ఛానెల్ పెట్టాలనుకునే యువత.. ఈ గ్రామానికి వచ్చి మరీ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. కంటెంట్ క్రియేటింగ్, వీడియో ఎడిటింగ్ పై శిక్షణ తీసుకుంటున్నారు.