Does the fan in your house make noise often?
Tech Tips: మీ ఇంట్లో ఫ్యాన్‌లో తరచూ శబ్దం వస్తుందా? ఈ ట్రిక్స్‌తో సమస్యకు చెక్!
Tech Tips: సాధారణంగా అందరి ఇళ్లల్లో సీలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి. ఫ్యాన్ పాతదైపోయినకొద్ది శబ్దం వస్తుంటుంది. ఈ సౌండ్ వల్ల ఇబ్బందిగా ఉంటుంది. మీరు మెకానిక్‌ను పిలిపించి చేయిస్తే ఖర్చు పెరుగుతుంది. చిన్నపాటి ట్రిక్స్‌తో ఆ సమస్యను మీరే పరిష్కరించుకోవచ్చ. మరి ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం..
Tech Tips: వేసవి కాలం మొదలవుతుండడంతో ప్రతి ఇంట్లో ఫ్యాన్లు జోరుగా తిరుగుతున్నాయి.ఈ సమ్మర్ సీజన్‌లో ఫ్యాన్ లేనిది ఉండని పరిస్థితి ఉంటుంది. సామాన్యులు ఇళ్లలో ఎక్కువగా ఫ్యాన్‌లనే ఉపయోగిస్తుంటారు. అయితే తరచుగా ఫ్యాన్ పాతబడిపోతున్న కొద్దీ అది గిలగిల కొట్టుకునే శబ్దం చేయడం ప్రారంభిస్తుంది. ఇది చాలా ఇళ్లలో ఒక పెద్ద సమస్యగా మారుతుంటుంది.
కొన్నిసార్లు ఫ్యాన్ చాలా పెద్ద శబ్దం చేస్తుంది. అది నిద్రకు భంగం కలిగిస్తుంది. చాలా మంది దానితో విసిగిపోయి ఫ్యాన్‌ను మారుస్తారు. కానీ నిజానికి చాలా పాత ఫ్యాన్లకు సర్వీసింగ్ చేయడం, వాటిని మరమ్మతు చేయడం వల్ల ఫ్యాన్ సౌండ్‌ను నియంత్రించవచ్చు.
సీలింగ్ ఫ్యాన్ బ్లేడ్‌లపై తరచుగా దుమ్ము పేరుకుపోతుంటుంది. దీని వలన ఫ్యాన్ నడుస్తున్నప్పుడు శబ్దం వస్తుంది. సీలింగ్ ఫ్యాన్ బ్లేడ్లను శుభ్రం చేయడం వల్ల ఫ్యాన్ నుండి వచ్చే శబ్దం ఆగిపోతుంది.
సీలింగ్ ఫ్యాన్ బ్లేడ్‌లకు అమర్చబడిన స్క్రూలు కూడా కొన్నిసార్లు వదులుగా ఉంటాయి. ఈ కారణంగా కూడా ఫ్యాన్‌లో శబ్దం వస్తుంటుంది. అందుకే మీరు బ్లేడ్‌లలోని స్క్రూలను టైట్ చేయడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు. ఫ్యాన్ మోటార్ పగిలిపోవడం వల్ల ఫ్యాన్ కూడా శబ్దం రావడం ప్రారంభమవుతుంది. మీరు సీలింగ్ ఫ్యాన్ మోటారును టెక్నీషియన్ పిలిపించుకుని చెక్ చేయించుకోవచ్చు.
చాలా సార్లు ఫ్యాన్ బ్లేడ్లు వంగి ఉన్నప్పుడు కూడా వాటి నుండి శబ్దం రావడం ప్రారంభమవుతుంది. ఫ్యాన్, దాని బ్లేడ్లను నిటారుగా చేయండి. కొన్నిసార్లు సీలింగ్ ఫ్యాన్‌లోని ఆయిల్ ఎండిపోవడం వల్ల ఫ్యాన్ శబ్దం చేస్తుంది. ఫ్యాన్ అన్ని భాగాలకు కొంత ఆయిల్ వేయండి.