AC Service: Is your AC leaking gas? Find out how!
AC Service: మీ ఏసీలో గ్యాస్ లీక్ అవుతుందా? ఇలా తెలుసుకోండి!
ఏప్రిల్ రాకముందే ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో మార్చి నుంచే ప్రజలు ఏసీ వేసుకోవడం మొదలుపెట్టారు. వేడి నుంచి ఉపశమనం కలిగించడానికి ఏసీ కంటే మెరుగైన ఎంపిక లేదన్నది ప్రజల ఫీలింగ్. ఇక ఇన్నాళ్లు ఆఫ్‌లో ఉన్న ఏసీకి సర్వీస్ చేయిస్తున్నారు. మీరు కూడా మీ ఇంటిలో AC సేవలను పొందాలని ప్లాన్ చేస్తుంటే ఈ ఆర్టికల్ ప్రత్యేకంగా మీ కోసమే. ఏసీకి సర్వీస్ చేయడానికి సర్వీస్ ఇంజనీర్ ఇంటికి రావడం తరచుగా కనిపిస్తుంది. పలుమార్లు ప్రజలను మోసం చేసి మరీ డబ్బులు దండుకుంటున్నారు. కొన్నిసార్లు సర్వీస్ ఇంజనీర్లు తప్పుడు సమాచారం ఇస్తారు. తద్వారా ఎక్కువ డబ్బు వసూలు చేస్తారు. మీరు ఈ విషయాల పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా గ్యాస్ లీక్ విషయంలో వినియోగదారులు మోసపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే ఏసీ గ్యాస్ లీక్ గురించి మీకు తప్పనిసరిగా అవగాహన ఉండాలి.
మీ ఏసీలో గ్యాస్ లీక్ అవుతుందా లేదా అన్నది కూలింగ్ కాయిల్‌ని చూసి తెలుసుకోవచ్చు. కాయిల్‌లో మంచు పేరుకుపోకుండా చూసుకోవాలి. ఒకవేళ పేరుకుపోతే మీ ఏసీలో గ్యాస్ లీక్ అయ్యే అవకాశం ఉంది.
ఏసీలో కూలింగ్ జరగకపోతే గ్యాస్ తగ్గిపోయి ఉండవచ్చు లేదా అయిపోయి ఉండవచ్చు.
ఏసీలో గ్యాస్ లీక్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి మీరు గేజ్ సహాయం కూడా తీసుకోవచ్చు. కంప్రెసర్ గోడలో ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. దీంతో మీరు గ్యాస్ ప్రెజర్ గురించి తెలుసుకోవచ్చు. ఇన్వర్టర్ ఏసీలో సాధారణ ఎయిర్ ప్రెజర్-150 ఉంటుంది. ఏసీని రీఫిల్ చేయవలసిన అవసరం లేదు. సాధారణ ACలో 60-80 ఎయిర్ ప్రెజర్ ఉంటుంది.
ఏసీలో ఇన్‌స్టాల్ చేసిన కంప్రెసర్ నుంచి గ్యాస్ తక్కువగా ఉందా లేదా అయిపోయిందో కూడా మీరు గుర్తించవచ్చు. గది ఉష్ణోగ్రతకు అనుగుణంగా కంప్రెసర్ ఆఫ్, ఆన్ అవుతూనే ఉంటుంది. మునుపటి కంటే చాలా ఆలస్యంగా ఆన్ అవుతుందని మీరు భావిస్తే, AC గ్యాస్ అయిపోయిందని మీరు అర్థం చేసుకోవచ్చు.