EPFO : A single mistake can freeze your PF money.. Must Read!
EPFO : ఒక్క పొరపాటు మీ PF డబ్బును నిలిచిపోయేలా చేస్తుంది.. తప్పక చదవండి!
EPFO Document Submission Process : మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు మీ శాలరీలో కొంతభాగం ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)కి వెళ్తుంది. ప్రతి నెలా చేసే ఈ చిన్న పొదుపు సంవత్సరాలు గడిచేకొద్దీ భారీ మొత్తాన్ని జోడిస్తుంది. కష్టకాలంలో ఈ డబ్బు ఉపయోగపడుతుంది. అయితే మీరు చిన్న పొరపాటు చేస్తే మీ PF డబ్బు నిలిచిపోవచ్చు. డబ్బు పొందడంలో మీ ప్రొఫైల్ సమాచారం సరిగ్గా ఉండడం అన్నిటికంటే ముఖ్యం.
కొత్త అప్‌డేట్ ఏంటి?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) సభ్యులు, యజమానుల UAN ప్రొఫైల్‌లలో తప్పులను సరిదిద్దడానికి జాయింట్ డిక్లరేషన్ కోసం డాక్యుమెంట్ జాబితాలో మార్పులు చేసింది. మార్చి 11, 2024 నాటి EPFOకు చెందిన SOP సవరించిన నోటిఫికేషన్ ప్రకారం, దరఖాస్తుదారు ఇప్పుడు సభ్యుని తండ్రి/తల్లి పేరు మీద ఆధార్ కార్డ్, PAN కార్డ్, తండ్రి/తల్లి పేరు మీద 10వ లేదా 12వ మార్క్‌షీట్, దరఖాస్తు చేసేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్(Driving License) ని సమర్పించవచ్చు.
UAN ప్రొఫైల్ వివరాలు:
UAN ప్రొఫైల్‌లో పుట్టిన తేదీ, తండ్రి/తల్లి పేరు, ఆధార్ నంబర్, వైవాహిక స్థితి, సభ్యుల పేరు, జెండర్ సమాచారాన్ని అప్‌డేట్ చేయవచ్చు. అయితే అప్‌డేట్ చేయడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి?
వైవాహిక స్థితి మార్పుపై ఈ పత్రాలను సమర్పించవచ్చు:
–> ప్రభుత్వం వివాహ ధ్రువీకరణ పత్రం.
–> ఆధార్ కార్డు.
–> పాస్పోర్ట్.
–> విడాకుల డిక్రీ.
పేరు, లింగంలో మార్పు ఉంటే ఈ పత్రాలను సమర్పించండి:
–> పాస్పోర్ట్.
–> జనన ధృవీకరణ పత్రం.
–> మరణ ధృవీకరణ పత్రం.
–> డ్రైవింగ్ లైలెన్స్.
–> కేంద్ర ప్రభుత్వం/రాష్ట్ర ప్రభుత్వం/కేంద్రపాలిత ప్రాంతం ప్రభుత్వం జారీ చేసిన సేవా ఫోటో గుర్తింపు కార్డు.
మీ పుట్టిన తేదీని సరిచేయడానికి మీరు ఈ పత్రాలను సమర్పించవచ్చు:
–> పాస్పోర్ట్.
–> పాన్ కార్డ్.
–> ప్రభుత్వం నివాస ధ్రువీకరణ పత్రం.
–> జనన మరణాల రిజిస్ట్రార్ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం.
–> గుర్తింపు పొందిన ప్రభుత్వ బోర్డు లేదా విశ్వవిద్యాలయం జారీ చేసిన మార్క్‌షీట్.
–> పేరు, పుట్టిన తేదీతో కూడిన సర్టిఫికేట్.
–> పుట్టిన తేదీ రుజువు లేనప్పుడు వైద్య ధృవీకరణ పత్రం.