What is Bombay Blood Group? How to register people with rare blood type
బాంబే బ్లడ్ గ్రూప్ అంటే ఏమిటి? రేర్ బ్లడ్ టైప్ ఉన్న వ్యక్తులు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే...
నేటి సమాజంలో అన్ని దానాల్లోకెల్లా రక్త దానం గొప్పది.. రక్తదానం చేయండి.. మరొకరి ప్రాణాలు కాపాడండి.. అని నినదిస్తున్నారు. అయితే రక్త దానం చెయ్యాలన్నా రక్తం స్వీకరించాలన్నా తప్పని సరిగా రక్తం గ్రూప్ తెలియాలి. అయితే అందరికీ తెలిసిన 8 బ్లడ్ గ్రూపులు మాత్రమే కాదు రేర్ బ్లడ్ గ్రూప్ అనగానే A-ve, B-ve, O-ve, AB-ve కూడా.. అయితే మరో రెండు అరుదైన గ్రూపులు కూడా ఉన్నాయి. అవే బాంబే బ్లడ్ గ్రూప్.. రీసస్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ .. వీటిని గోల్డెన్ బ్లడ్ అని కూడా పిలుస్తారు.
ముంబై లోని పరేల్‌లో ఆదివారం జరిగిన ఒక సమావేశంలో అరుదైన బొంబాయి బ్లడ్ గ్రూప్‌కు చెందిన దాదాపు 50 మంది వ్యక్తులు ఒక చోట సమావేశం అయ్యారు. ఈవెంట్ లో అసాధారణ రక్త వర్గం ఉన్నవారు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. దాదాపు 10,000 మంది భారతీయుల్లో ఒక్కరికి మాత్రమే ఉన్న ఈ అరుదైన బ్లడ్ గ్రూప్ కి చెందిన వారు ఇంకా ఉన్నారో లేదో తెలుసుకోవాలని ఆసక్తిగా కలిగి ఉన్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కూడా రక్త పరీక్షలు చేయించుకున్నారు. అసాధారణమైన బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తుల జాతీయ డేటాబేస్‌ను రూపొందించే దిశగా అడుగులు వేశారు.
‘బాంబే బ్లడ్’ గ్రూప్ అంటే ఏమిటి?
బొంబాయి బ్లడ్ గ్రూప్ ను హెచ్‌హెచ్ బ్లడ్ గ్రూప్ అని కూడా పిలుస్తారు. ఈ రకం బ్లడ్‌గ్రూప్‌ను ముంబై(ఒకప్పటి బొంబాయ్)కు చెందిన డాక్టర్ వైఎం బెండీ 1952లో గుర్తించారు. దీంతో ఈ రకం రక్తానికి బాంబే బ్లడ్ గ్రూప్ అని నామకరణం చేశారు. దీనిని ఇప్పుడు KEM వద్ద ICMR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునోహెమటాలజీ (NIIH) అని పిలుస్తారు. ఈ బ్లడ్ ఫినోటైప్ ప్రధానంగా భారత ఉపఖండం (భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్)తో పాటు ఇరాన్‌లో కనిపిస్తుంది. అత్యంత అరుదైన ఈ రక్తం ఓ నెగిటివ్ గ్రూప్‌లోని మరో సబ్‌టైప్. దీనికి వైద్యపరిభాషలో ‘ఓహెచ్’గా పిలుస్తారు. బాంబే బ్లడ్ గ్రూప్ రక్తం మిలియన్ మందిలో నలుగురికి మాత్రమే ఉండే అవకాశం ఉందని నిపుణులు నిర్ధారించారు.
భారతదేశంలో దాదాపు 450 మంది అరుదైన బొంబాయి బ్లడ్ గ్రూప్‌ను కలిగి ఉన్నారని తెలిసింది. అయితే, కేంద్రీకృత రిపోజిటరీ లేకపోవడంతో బొంబాయి రక్తదాతల వివరాలు స్థానిక సంస్థలు, బ్లడ్ బ్యాంకుల మధ్య చెల్లాచెదురుగా ఉన్నాయి. పర్యవసానంగా, రక్తదానం చేయడానికి దాతలు తరచుగా నగరాలు, రాష్ట్రాలలో ప్రయాణించవలసి ఉంటుంది.
టైమ్స్ ఆఫ్ ఇండియా (TOI) నివేదిక ప్రకారం ICMR-NIIH డైరెక్టర్ డాక్టర్ మనీషా మద్కైకర్ మాట్లాడుతూ,
దేశంలో బాంబే బ్లడ్ గ్రూపు రక్తం అవసరం ఉన్నవారి కోసం.. కొంతమంది కలిసి బాంబే బ్లడ్‌గ్రూప్ డాట్ ఓఆర్‌జీ పేరిట ఓ వైబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ రకమైన బ్లడ్ అవసరమైన వారు ఈ వైబ్‌సైట్‌లో తమ పేర్లు నమోదు చేసుకుంటే డోనర్లను వెతికి పట్టుకుని అవసరమైన రక్తాన్ని అందిస్తారు. ఈ వెబ్‌సైట్ విశ్లేషణ ప్రకారం మహారాష్ట్రలోనే ఈ బ్లడ్‌గ్రూప్ రక్తం ఉన్నవారు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. మొత్తం 450 మంది ముంబై బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఉండగా.. అర్హులైన దాతల సంఖ్య ఇంకా తక్కువగా ఉంది. ముంబై నగరం నుంచి ఈ బాంబే బ్లడ్ యూనిట్లు బంగ్లాదేశ్‌కు ,రెండు యూనిట్లు వియత్నాంకు గత సంవత్సరం విరాళం ఇచ్చారు.