Parent tips: Are your children addicted to social media? Do this.. - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

Parent tips: Are your children addicted to social media? Do this..

24_03

 Parent tips: Are your children addicted to social media? Do this..

Parent tips: మీ పిల్లలు సోషల్‌ మీడియాకు బానిసలవుతున్నారా.? ఇలా చేయండి..

Parent tips: Are your children addicted to social media? Do this.. Parent tips: మీ పిల్లలు సోషల్‌ మీడియాకు బానిసలవుతున్నారా.? ఇలా చేయండి..

సోషల్‌ మీడియా విస్తృతి ఏమంటూ పెరిగిందే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ బానిసలుగా మారిపోతున్నారు. స్కూల్‌కి వెళ్లే చిన్నారి నుంచి ఉద్యోగానికి విరమణ చేసిన వ్యక్తి వరకు ప్రతీ ఒక్కరూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా మారుతున్నారు. సోషల్‌ మీడియా సైట్స్‌కు కూడా ప్రపంచాన్ని అరచేతిలోకి తీసుకోవడంతో విపరీతంగా అడిక్ట్ అవుతున్నారు.

దీంతో చిన్నారులు, టీనేజీ యువతీయువకులు ఎక్కువగా ఉంటున్నారు. సోషల్‌ మీడియాలో కనిపించేది అంతా నిజమేనన్న భావనలో ఉంటూ కొన్ని సందర్భాల్లో జీవితాలోనే నాశనం చేసుకుంటున్నారు. అయితే ఈ సోషల్‌ మీడియా అడిక్షన్‌ను తగ్గించడానికి పలు మార్గాలు ఉన్నాయి. సోషల్ మీడియా ఊబిలో మీ పిల్లలు పడకుండా ఉండాలంటే కొన్ని రకాల టిప్స్‌ పాటించాల్సి ఉంటుంది. అలాంటి కొన్ని టిప్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పేరెంట్స్‌ చిన్నారులతో తగినంత సమయం కేటాయించాలి. వారితో సరదాగా మాట్లాడాలి. అప్పుడప్పుడు చిన్నారులు అలా బయకుట తీసుకెళ్తూ కొత్త ప్రదేశాలను సందర్శించాలి. దీనివల్ల సోషల్‌ మీడియా అడిక్షన్‌ కొంతమేర తగ్గుతుంది. అలాగే తాము ఒంటరిగా ఉన్నామన్న భావం కలిగితే సోషల్‌ ఈ మీడియాలో స్నేహాలవైపు అట్రాక్ట్ అవుతుంటారు. కాబట్టి ఆ లోటును తీర్చే బాధ్యత పేరెంట్స్‌పై ఉంటుందని గుర్తించాలి.

పిల్లలకు కుటుంబం అత్యంత ముఖ్యమని గ్రహించేలా చేయాలి. కుటుంబంతో కలిసి కచ్చితంగా రోజులో ఒక్కసారైనా భోజనం చేయాలనే కండిషన్‌ పెట్టుకోవాలి. అలాగే నెలకొకసారైనా కుటుంబ సభ్యులంతా కలిసి అలా అవుటింగ్‌ వెళ్లాలి. సోషల్‌ మీడియాలో వర్చువల్‌గా లభించే ప్రేమ, స్నేహాలను నేరుగా వారికి అందించాలి. ఇక చిన్నారులను బిజీగా ఉంచడానికి వారికి ఇతర వ్యాపకాలను అలవాటు చేయాలి.

ముఖ్యంగా స్కూల్‌, కాలేజీలకు సెలువులు ఉన్న రోజుల్లో వారికి ఏవైనా యాక్టివిటీస్‌ నేర్పించాలి. వారిలో కొత్త అంశాలపై అభిరుచి పెరిగేలా మార్గదర్శకం చేయాలి. ఇక మీ పిల్లలు ఫోన్‌లో ఏం చేస్తున్నారన్న దానిపై ఎప్పుడూ ఓ కన్నేసి చూడాలి. ఇందు కోసం ఎన్నో రకాల యాప్స్‌ సైతం అందుబాటులో ఉన్నాయి.