DEPOSIT CASH IN ATM WITH UPI - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

DEPOSIT CASH IN ATM WITH UPI

25_03

 HOW TO DEPOSIT CASH IN ATM WITH UPI

కేవలం​ UPIతో క్యాష్​ను​ అకౌంట్లో డిపాజిట్​ చేయొచ్చు - ATM కార్డు, బ్యాంకుతో పనేలేదు!

- ఏటీఎం సెంటర్లో నగదు డిపాజిట్ ఇక మరింత సులభతరం

HOW TO DEPOSIT CASH IN ATM WITH UPI

How to Deposit Cash in ATMs with UPI: గతంలో డబ్బులు అకౌంట్లో డిపాజిట్ చేయాలంటే బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. ఆ తర్వాత ఏటీఎం సెంటర్లలో క్యాష్ డిపాజిట్ మెషీన్స్​ వచ్చాయి. అయితే ATM కేంద్రాల్లో క్యాష్‌ డిపాజిట్‌ మెషీన్లలో నగదు డిపాజిట్ చేయాలంటే డెబిట్ కార్డు లేదా అకౌంట్​ నెంబరు తప్పనిసరి. అయితే ఇకపై అలాంటి అవసరం లేకుండానే యూపీఐ సాయంతో అకౌంట్‌లోకి నగదు డిపాజిట్‌ చేయొచ్చు. ఈ పద్ధతిని యూపీఐ ఇంటరాపరేబుల్‌ క్యాష్‌ డిపాజిట్‌ (UPI-ICD) అంటారు. మరి దీని ద్వారా డబ్బులు ఎలా డిపాజిట్​ చేయాలో ఇప్పుడు చూద్దాం.

యూపీఐ-ఐసీడీ సాయంతో బ్యాంకులు, వైట్‌లేబుల్‌ ఆపరేటర్లు నిర్వహించే ఏటీఎం కేంద్రాల వద్ద డెబిట్‌ కార్డు అవసరం లేకుండా నగదును డిపాజిట్ చేయొచ్చు. సొంత బ్యాంక్‌ అకౌంట్‌లో గానీ, ఇతరుల బ్యాంక్‌ అకౌంట్‌లో గానీ ఈ డబ్బులను జమ చేయవచ్చు. మొబైల్‌ నంబర్‌తో అనుసంధానం అయిన యూపీఐ, వర్చువల్‌ పేమెంట్‌ అడ్రస్‌, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ వీటిల్లో ఏదైనా ఒకటి ఎంటర్ చేసి నగదు జమ చేయొచ్చు.

ఎలా డిపాజిట్​ చేయాలంటే:

  • ముందుగా క్యాష్‌ డిపాజిట్‌ చేసుకునే వెసులుబాటు ఉన్న ఏటీఎం కేంద్రానికి వెళ్లాలి.
  • క్యాష్​ డిపాజిట్​ మెషీన్​ స్క్రీన్​ మీద UPI ICD లేదా యూపీఐ క్యాష్‌ డిపాజిట్‌ (UPI Cash Deposit) ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • అప్పుడు స్క్రీన్​ మీద క్యూఆర్‌ కోడ్‌ ప్రత్యక్షం అవుతుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఏదైనా యూపీఐ యాప్​ను యూజ్​ చేసి క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి.
  • క్యూఆర్​ కోడ్​ స్కాన్​ చేసిన తర్వాత మీకు ఫోన్​లో ఓ ఆప్షన్​ కనిపిస్తుంది.
  • అందులో మీ బ్యాంక్​ అకౌంట్​లో డబ్బులు డిపాజిట్​ చేయాలా? లేదా వేరే వాళ్ల బ్యాంక్​ అకౌంట్​లో డిపాజిట్​ చేయాలా? అని అడుగుతుంది.
  • మీ అకౌంట్లోకి వేసుకోవాలనుకుంటే Deposit in Own Account ఆప్షన్​పై క్లిక్​ చేయగానే, యూపీఐతో లింక్​ అయి ఉన్న బ్యాంక్​ అకౌంట్స్​ ఫోన్​ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
  • ఏ బ్యాంక్​ అకౌంట్లో డబ్బులు వేయాలో దానిపై క్లిక్​ చేయాలి.
  • వెంటనే​ కరెన్సీ డిపాజిట్​ చేసే డోర్​ ఓపెన్​ అవుతుంది. అందులో మీరు ఎంత డిపాజిట్​ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్​ ఉంచాలి.
  • ఆ మెషీన్​ కౌంట్​ చేసి అందుకు సంబంధించిన వివరాలు ఏటీఎం మెషీన్​ స్క్రీన్​ మీద చూపిస్తుంది.
  • ఆ వివరాలు కరెక్ట్​గా ఉంటే Confirm ఆప్షన్​పై క్లిక్​ చేయాలి. అంతే ఆ అమౌంట్​ అనేది మీ బ్యాంక్​ అకౌంట్లో డిపాజిట్​ అవుతుంది.